|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 03:53 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన మేనేజర్ శ్రేయాస్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ తమిళ టీవీ నటి మాన్య ఆనంద్, శ్రేయాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ కొత్త సినిమా అవకాశం కోసం ఆయన తనను "కమిట్‌మెంట్" అడిగాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు.మాన్య తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ధనుష్ మేనేజర్ శ్రేయాస్ ఓ కొత్త సినిమా కోసం నన్ను సంప్రదించారు. సినిమాకు కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారు. ఎలాంటి కమిట్‌మెంట్ అని నేను ప్రశ్నించాను. సినిమా కోసం అలాంటి షరతులు అంగీకరించేందుకు నేను సిద్ధంగా లేనని చెప్పాను. అప్పుడు అతను, 'ధనుష్ సర్ అయినా ఒప్పుకోరా?' అని అడిగాడు" అని వివరించారు.మాన్య ఆరోపిస్తూ, తాను తిరస్కరించినా శ్రేయాస్ చాలాసార్లు ఫోన్ చేసి, ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్‌కు పంపాడని, స్క్రిప్ట్ చదవాలని ఒత్తిడి చేశాడని చెప్పారు. "మేము నటులం, నటించడం మా పని. అవకాశాలు ఇవ్వండి కానీ ప్రతిఫలంగా ఏమీ ఆశించవద్దు. ఇండస్ట్రీలో ఈ పద్ధతికి ముగింపు పలకాలి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News