|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 02:20 PM
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన కానుకను ప్రకటించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రేక్షకులకు కృతజ్ఞతగా, నేడు ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది.ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం, కేవలం మౌత్ టాక్‌తో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ ప్రేమకథ ప్రేక్షకులను కట్టిపడేయడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజు రూ.1.40 కోట్లు రాబట్టిన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఈ అనూహ్య విజయంతో ఆనందంలో ఉన్న చిత్ర నిర్మాతలు, తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఆఫర్‌ను ప్రకటించారు. సినిమాలోని ‘రాంబాయి’ పాత్ర మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉందని, అందుకే ఎక్కువ మంది మహిళలు ఈ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ఆఫర్ కింద ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలు ఉచితంగా సినిమా చూడవచ్చు. ఇందుకు సంబంధించిన థియేటర్ల జాబితాను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. అయితే, ఈ అవకాశం కేవలం నేడు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
థియేటర్ల జాబితా ఇదే..
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
అనంతపురం: SV సినీ మాక్స్
కావలి: లత, మానస
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కడప: రవి
రాయచోటి: సాయి
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
కర్నూలు: ఆనంద్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
Latest News