|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 01:59 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి నమోదైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, ఇన్‌ఫ్లుయెన్సర్ అమృత చౌదరిలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకానున్నారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు వీరి పాత్ర, ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ జరగనుంది. సినీ ప్రముఖులు ఇందులో చేరడంతో కేసుపై మరింత దృష్టి సారించారు.
Latest News