|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 04:08 PM
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన ఆహారపు అలవాట్ల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైట్‌లను పాటించకుండా, రోజుకు 10 ఇడ్లీలు లేదా 10 దోసెలు తింటానని, అయితే క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడం ద్వారా ఫిట్‌గా ఉంటానని తెలిపారు. ఒకే ఏడాదిలో 10 కిలోలు తగ్గానని కూడా ఆమె చెప్పారు. నవంబర్ 28న విడుదల కానున్న ‘రివాల్వర్ రీటా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
Latest News