|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 05:33 PM
హీరో నిఖిల్ సిద్ధార్థ అభిమానుల నిరీక్షణకు చిత్ర బృందం తెరదించింది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.విడుదల తేదీ ప్రకటన సందర్భంగా 'రైజ్ ఆఫ్ స్వయంభు' పేరుతో ఓ ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు, భారీ సెట్టింగులు, నిఖిల్ వారియర్ లుక్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మొత్తం మీద ఈ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని చిత్ర బృందం వెల్లడించింది. త్వరలోనే ప్రమోషన్లు పెద్ద ఎత్తున ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Latest News