|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:10 PM
ప్రముఖ నటి సమంత తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తెరదించుతూ, కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో వీరి పెళ్లి వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది.పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రాజ్ కుటుంబంతో సమంత దిగిన ఒక ఫ్యామిలీ ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు ఈ ఫొటోను పంచుకుంటూ, "శివుడి ఆధ్వర్యంలో ఈ పెళ్లి జరగడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. దీనికి సమంత 'లవ్ యూ' అని బదులివ్వడంతో వారి కుటుంబ బంధంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News