|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:37 PM
ఒకప్పటి కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిన ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నటుడు నాగార్జున తెలిపారు. గోవాలో జరిగిన ఇఫి వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'శివ' రీరిలీజ్ వెర్షన్‌ను 4కేలోకి మార్చామని, అందరూ చూసి ఆనందించాలనే ఉద్దేశ్యంతోనే ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. ఏఐ టెక్నాలజీతో పనులు సులభమయ్యాయని, అన్నపూర్ణ స్టూడియోస్‌లో మంచి సాంకేతికత అందుబాటులో ఉందని తెలిపారు.
Latest News