|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:12 PM
ఇండస్ట్రీలో పనిగంటలపై కొంతకాలంగా చర్చపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.... ఒక రోజు అదనపు షూటింగ్ కంటే రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడం సులువని దుల్కర్ సల్మాన్ అభిప్రాయపడ్డారు. తెలుగు, మలయాళం, తమిళ ఇండస్ట్రీలో తన అనుభవాన్ని వివరిస్తూ.. మళయాళంలో ఉదయం షూటింగ్ ప్రారంభమయ్యాక ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదన్నారు. తమిళ ఇండస్ట్రీలో మాత్రం నటీనటులకు ప్రతి నెలా రెండు ఆదివారాలు సెలవు ఇస్తారని వివరించారు. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే.. మహానటి సినిమా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తాను సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని దుల్కర్ సల్మాన్ గుర్తుచేసుకున్నారు.
Latest News