|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 12:53 PM
న్యాచురల్ స్టార్ నాని, 'ఓజీ' దర్శకుడు సుజీత్ తో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'గన్స్ అండ్ రోజెస్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని స్టైలిష్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారని, సుజీత్ నాని కోసం కొత్త తరహా కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. 'ది ప్యారడైజ్' తర్వాత నాని, 'ఓజీ' తర్వాత సుజీత్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు
Latest News