|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:21 PM
ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ (31) దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన మాజీ ప్రియుడు, మృతదేహాన్ని ఒక సూట్‌కేసులో కుక్కి పొరుగు దేశమైన స్లోవేనియాలోని అడవిలో పాతిపెట్టాడు. వారం రోజులుగా అదృశ్యమైన ఆమె కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.మేకప్, ఫ్యాషన్ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన స్టెఫానీ, నవంబర్ 23న ఒక క్రిస్మస్ పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి సురక్షితంగా చేరుకున్నానని స్నేహితురాలికి మెసేజ్ పంపిన కాసేపటికే, తన మెట్ల వద్ద ఎవరో ఉన్నారని అనుమానంగా ఉందంటూ మరో మెసేజ్ పంపారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.అదే రోజు రాత్రి వారి అపార్ట్‌మెంట్‌లో గొడవ జరిగిన శబ్దాలు విన్నామని, స్టెఫానీ మాజీ ప్రియుడిని అక్కడ చూశామని పొరుగువారు పోలీసులకు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Latest News