|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 04:53 PM
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిన్న చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి' ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈ విజయం సందర్భంగా మంగళవారం చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి.. 'రాజు వెడ్స్ రాంబాయి' దర్శకుడు సాయిలుకు వేదికపైనే ఓ బంపరాఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రాన్ని చూసి తాను ఎంతో ముగ్ధుడనయ్యానని బాబీ తెలిపారు. సాయిలు ప్రతిభకు ఫిదా అయిన ఆయన.. తాను మెగాస్టార్ చిరంజీవితో తీయబోయే తదుపరి సినిమాలో సాయిలుకు ఒక పాత్రను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఊహించని ఈ ప్రతిపాదనతో సాయిలు కంపాటి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని ఎంతో సంతోషంగా అంగీకరించారు.
Latest News