|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 04:45 PM
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నంది కిష్టయ్య (73) మంగళవారం రాత్రి అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం సంపత్ నంది హీరో శర్వానంద్‌తో 'భోగి' అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఈ విషాదం జరగడంతో ఆయన కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది. ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు సంపత్ నందికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Latest News