|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 03:16 PM
బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి తన కుడిచేయి దెబ్బతినడంపై వివరణ ఇచ్చారు. చిన్నతనంలో స్కూల్‌లో చదువుతున్నప్పుడు కరెంట్ షాక్ తగలడం వల్ల చేయి తీవ్రంగా దెబ్బతిందని, అప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం తన జీవితంలో పెద్ద బాధ్యతగా మారిందన్నారు. శారీరక సమస్యను కెరీర్‌కు అడ్డంకిగా మార్చుకోకుండా, తన ప్రతిభ, పట్టుదలతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించిన సాయిలు, తన అసలు పేరు జగదీశ్ చంద్రబోస్ అని, తన తాత పేరు సాయిలు అని, ప్రస్తుతం తనను బోసు అని పిలవమని కోరారు.
Latest News