|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:18 PM
అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తన కొత్త లుక్‌తో సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇటీవల ఓ ఫొటోషూట్‌లో ఆమె గతంలో కంటే చాలా సన్నగా కనిపించడంతో ఆమె బరువు తగ్గడంపై తీవ్రమైన చర్చ మొదలైంది. ప్రముఖ వెయిట్-లాస్ డ్రగ్ 'ఓజెంపిక్' వాడటం వల్లే ఆమె సన్నబడ్డారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండానే నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.ప్రముఖ ఫొటోగ్రాఫర్ అనీ లీబోవిట్జ్ తీసిన ఫొటోషూట్‌కు సంబంధించిన తెరవెనుక చిత్రాలను మిషెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. బూడిద రంగు టీ-షర్ట్, జీన్స్‌లో ఆమె చాలా ఫిట్‌గా కనిపించారు. అయితే, ఆమె ప్రాజెక్ట్ వివరాల కంటే ఆమె శారీరక మార్పుపైనే అందరి దృష్టి పడింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి వేదికలపై "ఇది కచ్చితంగా ఓజెంపిక్ ప్రభావమే", "నిజం ఒప్పుకోవాలి కదా" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Latest News