|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 12:01 PM
తెలుగులో 'మహానటి' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్, ఆ సినిమా తర్వాత తనకు ఆరు నెలల పాటు ఎలాంటి అవకాశాలు రాలేదని తెలిపారు. సావిత్రి పాత్రలో తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయినా, దర్శకులు తనను సీరియస్ పాత్రలకే పరిమితం చేస్తారేమోనని భయపడ్డారని, దీంతో కమర్షియల్ సినిమాలు తీసేవారు తన వద్దకు రాలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సమయంలో తాను మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్ రీటా'తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.
Latest News