|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:15 PM
ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత శరవణన్ (85) భౌతిక కాయానికి నటుడు సూర్య, తమిళనాడు సీఎం స్టాలిన్, రజనీకాంత్, శివకుమార్ తదితరులు నివాళులర్పించారు. గురువారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన శరవణన్, తమిళం, తెలుగు సహా పలు భాషల్లో 300కిపైగా సినిమాలు నిర్మించారు. సూర్య నటించిన ‘పెరళగన్’, ‘వీడొక్కడే’ వంటి చిత్రాలు ఏవీఎం ప్రొడక్షన్స్‌లోనే తెరకెక్కాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సూర్య భావోద్వేగానికి గురయ్యారు.
Latest News