|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 11:58 AM
శంకరవరప్రసాద్ సినిమా ప్రమోషన్లలో అనిల్ రావిపూడి దూకుడు ప్రదర్శిస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టి, పలు ఆకట్టుకునే వీడియోలను విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొంది, ఆయన బ్లాక్‌బస్టర్ డైలాగ్స్‌ను ఈ సినిమాలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మేకింగ్ వీడియో దీనికి నిదర్శనం. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా కోసం, మిగిలిన 40 రోజుల్లో ప్రమోషన్లను మరింత ముమ్మరం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Latest News