|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 02:11 PM
రొమాంటిక్ కామెడీ జోనర్ కి చెందిన ఒక సినిమా ఈ నెల 26వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరే 'జింగిల్ బెల్ హీస్ట్'. ఒలీవియా హాల్ట్ .. కానర్ స్విండెల్స్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, మైఖేల్ ఫిమోగ్నారి దర్శకత్వం వహించాడు.
ఇక కథ విషయానికొస్తే .... నిక్ (కానర్ స్విండెల్స్) ఒక దొంగ. లండన్ లో దొంగతనాలు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతనికి భార్య .. కూతురు ఉంటారు. గతంలో అతను స్టెర్లింగ్ కి సంబంధించిన ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ లో పనిచేస్తాడు. స్టెర్లింగ్ స్వార్థానికి 'నిక్' జైలు జీవితం అనుభవించి బయటికి వస్తాడు. అప్పటి నుంచి అతని వైవాహిక జీవితం గందరగోళంగా మారుతుంది. భార్యా బిడ్డలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుకోవాలనే ఒక ఆలోచనలో అతను ఉంటాడు. ఇక సోఫియా ( ఒలీవియా హాల్ట్) విషయానికి వస్తే, ఆమె ప్రస్తుతం ఆమె అదే డిపార్టుమెంటల్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోలుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుందని డాక్టర్లు చెబుతారు. దాంతో ఆ డబ్బును ఎలా సర్దుబాటు చేయాలా అని ఆమె ఆలోచనలో పడుతుంది. అలాంటి సమయంలోనే ఆమెకి 'నిక్' తారసపడతాడు. ఒకరి గురించిన విషయాలు ఒకరు చెప్పుకుంటారు. ఆ సమయంలోనే వారి మనసులు కలుస్తాయి కూడా. డిపార్ట్మెంటల్ స్టోర్ లోని ఒక సీక్రెట్ ప్లేస్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందనీ, ఆ డబ్బును కాజేస్తే తమ అవసరాలు తీరతాయని 'నిక్' తో సోఫియా చెబుతుంది. అయితే సీక్రెట్ ప్లేస్ కి వెళ్లడం .. ఆ 'లాకర్' ను ఓపెన్ చేయడం చాలా కష్టమైన విషయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఎంత రిస్క్ అయినా తీసుకోక తప్పదని అంటాడు నిక్. ఆ డబ్బు కోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నంలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.
Latest News