|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:48 PM
దేవయాని... తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. సుస్వాగతం హీరోయిన్ నటి దేవయాని పెద్ద కుమార్తె ఇనియా, సరిగమప సీజన్ 5 షోలో పాల్గొని ఇటీవల ఎలిమినేట్ అయ్యింది. తాజాగా ఆమె నెమలి రంగు పట్టు చీరలో, పెళ్లి కూతురులా సాంప్రదాయ లుక్‌లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అందంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ, సినీరంగంలోకి అడుగుపెడుతుందా అని ఊహాగానాలు చేస్తున్నారు. ఇనియా తన తల్లి దేవయానిలాగే అందంగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Latest News