|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 04:14 PM
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగానికి సంబంధించి నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకుంది. తమ రాబోయే చిత్రాలైన ‘డ్యూడ్’ మరియు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లలో ఇళయరాజా సంగీతాన్ని ఉపయోగించుకునేందుకు గాను, ఆయనకు రూ.50 లక్షలు చెల్లించడానికి సంస్థ అంగీకరించినట్లు సమాచారం. ఈ చెల్లింపుతో మైత్రీ మూవీస్ సంస్థకు అధికారిక హక్కులు లభించినట్లు తెలుస్తోంది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News