|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:53 PM
రొమాంటిక్ కామెడీ జోనర్లో సినిమాలు చేయడంలో తమిళ మేకర్స్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ తరహా సినిమాలు అటు థియేటర్లలో సందడి చేయడమే కాకుండా, ఇటు ఓటీటీ వైపు నుంచి కూడా మంచి మార్కులు కొట్టేస్తున్నాయి. అలాంటి ఒక సినిమానే 'ఆన్ పావమ్ పొల్లతత్తు'. అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 28 నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: శివ (రియో రాజ్) మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఐదు అంకెల జీతమే సంపాదిస్తూ ఉంటాడు. తల్లి .. తండ్రి .. తమ్ముడు .. ఇదే అతని కుటుంబం. ఇక శక్తి (మాళవిక మనోజ్) ప్లస్ టూ దాటడానికి నానా తంటాలు పడుతుంది. క్రమశిక్షణ .. పద్ధతి అంటూ తండ్రి పెట్టే ఆంక్షలు ఆమెకి ఇబ్బందిగా మారతాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకి శివతో వివాహం జరుగుతుంది. ఇద్దరూ కలిసి వేరు కాపురం పెడతారు. భర్త అంటే బాస్ .. భార్య అంటే బానిస అనే మాటలు శివకి నచ్చవు. ఇద్దరూ సమానమే అనేది అతని అభిప్రాయం. స్త్రీకి స్వేచ్ఛ అవసరమే అని భావించేవాళ్లలో ఆయన ఒకడు. శక్తికి పెద్దగా తెలివి తేటలు లేకపోయినా, ఈ తరం అమ్మయినని నిరూపించుకోవడానికి తపన పడుతూ ఉంటుంది. ఆమె మీద సినిమాల ప్రభావం .. సోషల్ మీడియా ప్రభావం ఉన్నాయనే విషయం శివకి అర్థమైపోతుంది. అయినా అతను సర్దుకుపోతుంటాడు. కొత్త ఇంట్లో రీల్స్ చేస్తూ శక్తి కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తనని అర్థం చేసుకునే భర్త దొరికినందుకు సంతోషపడుతుంది. 400 ఏళ్లపాటు అతనితోనే కలిసి ఉండాలనిపిస్తుందని చెబుతుంది. అయితే 400 రోజులు దాటగానే ఇద్దరి మధ్య వ్యవహారం చెడుతుంది. ఒక వైపు నుంచి శివ.. మరో వైపు నుంచి శక్తి కోర్టు మెట్లు ఎక్కుతారు. అందుకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? చివరికి వాళ్లిద్దరూ కలిసున్నారా? విడిపోయారా? అనేది మిగతా కథ.
Latest News