|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:07 PM
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటనలో మాత్రమే కాదు, చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచే వారు. ఆయన అకడమిక్ ప్రదర్శనను చూపే ఓ మార్కుల షీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అభిమాన నటుడికి చదువులో వచ్చిన మార్కులను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ మార్కుల షీట్ ప్రకారం, షారూఖ్ ఖాన్ ఢిల్లీలోని ప్రఖ్యాత హన్స్‌రాజ్ కాలేజీలో 1985-88 మధ్య ఎకనామిక్స్‌లో డిగ్రీ చదివారు. ఆయనకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 78 చొప్పున మార్కులు రాగా, ఇంగ్లీష్‌లో 51 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లోనూ ఆయన మంచి మార్కులే సాధించడం విశేషం. చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న షారూఖ్‌కు క్రీడల పట్ల కూడా ఆసక్తి ఉండేది.ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, షారూఖ్ జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్ కోర్సులో చేరారు. అయితే, అక్కడే ఆయన జీవితం మలుపు తిరిగింది. నటనపై ఆసక్తితో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. 1992లో ‘దీవానా’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి అగ్ర హీరోగా ఎదిగారు.
Latest News