|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:09 PM
అజిత్ కుమార్ అభిమానులకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ శుభవార్తను అందించారు. ఈ ఏడాది వీరిద్దరి కలయికలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అజిత్‌తో మరో సినిమా చేయనున్నట్లు అధిక్ రవిచంద్రన్ అధికారికంగా ప్రకటించారు.చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అజిత్‌తో చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. "ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది," అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
Latest News