|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 03:04 PM
'ఆషికీ' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి అను అగర్వాల్, తన జీవితంలోని ఓ ముఖ్యమైన విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనను మానసికంగా నయం చేయడంలో 'కరుణ' కీలక పాత్ర పోషించిందని ఆమె తెలిపారు. మరేదీ ఇవ్వలేని బలాన్ని, స్పష్టతను కరుణ తనకు అందించిందని తాజాగా ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.తన ఫౌండేషన్‌ను ప్రారంభించినప్పుడు కరుణనే ప్రధాన సూత్రంగా పెట్టుకున్నానని అను అగర్వాల్ వివరించారు. "ప్రపంచంలో కరుణ లేనప్పుడు 'నేను-వాళ్లు' అనే విభజన మొదలవుతుంది. అక్కడే హింసకు బీజం పడుతుంది. యుద్ధాలు పుడతాయి. కానీ, నా ఫౌండేషన్‌లో కరుణనే నా కార్యాచరణ అయింది. దాంతో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ ప్రేమే తిరిగి వచ్చి, నన్ను అద్భుతంగా నయం చేసింది. కరుణతో నిండిన ప్రపంచమే శాంతియుతమైన ప్రపంచం" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Latest News