|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:30 PM
భారత చిత్ర పరిశ్రమ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా, తన కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో, ముఖ్యంగా ఇంగ్లీష్ సినిమాల్లో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని ఆమె అన్నారు. ఒక నటిగా తనలోని సృజనాత్మక దాహం ఇంకా తీరలేదని, చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు.2015లో అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక, ఆ తర్వాత 'బేవాచ్', 'ది మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్', 'సిటాడెల్' వంటి పలు ప్రాజెక్టులతో అంతర్జాతీయ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్ భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. "ఒక కళాకారిణిగా హాలీవుడ్ సినిమాల్లో నేను ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. నిజం చెప్పాలంటే, ఇప్పటివరకు నేను చేసింది చాలా తక్కువ. హిందీ సినిమా రంగంలో దాదాపు అన్ని జానర్లలోనూ నటించాను. ఇప్పుడు అదే స్థాయిలో అంతర్జాతీయ సినిమాల్లో, అది ఏ భాష అయినా సరే, విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను" అని ప్రియాంక వివరించారు.కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. సమాజంలో మార్పు తెచ్చే, ప్రేక్షకులను ఆలోచింపజేసే, వారిని కదిలించే కథలను తెరకెక్కించాలన్నది తన ఆశయమని అన్నారు. ఇందుకోసం 2015లో 'పర్పుల్ పెబుల్ పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థను స్థాపించినట్లు గుర్తుచేశారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు, నటీనటులను ప్రోత్సహించాలనుకుంటున్నట్లు తెలిపారు.
Latest News