|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 05:35 PM
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇటీవల 'ఈఠా' సినిమా షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. తన కాలి గాయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఆమె తాజాగా తన ఆరోగ్యంపై స్పష్టత నిచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని, వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు.సోషల్ మీడియాలో ఒక అభిమాని తన గాయం గురించి అడగ్గా, శ్రద్ధా స్పందించారు. "ఇది పెద్ద దెబ్బేమీ కాదు. కాలి కండరానికి గాయమై, కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. నేను క్షేమంగానే ఉన్నాను. త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌తో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Latest News