|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 03:05 PM
యదార్థ కథ ఆధారంగా రూపొందిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి ఓ సరికొత్త ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుందని విడుదలకు ముందు నుంచే మేకర్స్ ప్రకటించడం.. ఈ చిత్రం నచ్చకపోతే నేను డ్రాయర్ మీద అమీర్‌పేట్ చౌరస్తాలో ఉరుకుతా అని దర్శకుడు బహిరంగంగా సవాల్ విసరడంతో ఈ చిత్రంపై, ఈ సినిమా ఫలితంపై అందరిలోనూ ఆసక్తి కలిగింది. ఇక ఈ వాస్తవ ప్రేమకథ ప్రేక్షకులను అలరించిందా? ఈ సినిమా సమీక్షలో తెలుసుకుందాం.
కథ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... ఓ పల్లెటూరులో జరిగే కథ ఇది. ఆ ఊర్లో తండ్రి వారసత్వంగా ఫంక్షన్‌లకు బ్యాండ్ కొట్టుకుంటూ, ఫ్రెండ్స్‌తో సరదాగా తిరుగుతుంటాడు రాజు. (అఖిల్ రాజ్) అదే ఊరికి చెందిన రాంబాయిని (తేజస్విని) ప్రేమిస్తుంటాడు. ప్రారంభంలో రాజు ప్రేమను తిరస్కరించినా, తరువాత అతను తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న తరువాత రాంబాయి కూడా రాజుని ప్రేమిస్తుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్న మాత్రం తన కూతురును ఓ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రాంబాయికి ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే చేయాలనే సంకల్పంతో ఉంటాడు వెంకన్న. అయితే రాజు, రాంబాయి పెళ్లి కోసం శారీరకంగా కలుసుకుంటారు. తనను, రాజు గర్బవతిని చేస్తే తండ్రి తప్పకుండా తమ పెళ్లి చేస్తాడని అనుకుంటారు ఈ ప్రేమికులు. అయితే ఈ నేపథ్యంలో రాజు, రాంబాయిల ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? రాజు, రాంబాయిలు పెళ్లి చేసుకోకుండా వెంకన్న ఎంతటి దుర్మారపు ఆలోచన చేశాడు? అనేది మిగతా కథ
Latest News