|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 10:39 AM
నటి సోనాలి బింద్రే ఇటీవల ఒక కార్యక్రమంలో క్యాన్సర్ నుంచి బయటపడటానికి ప్రకృతి వైద్యం కూడా సహాయపడిందని చెప్పడం వివాదానికి దారితీసింది. వైద్యులు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టడంతో సోనాలి వివరణ ఇచ్చారు. తాను డాక్టర్ కాదని, ఎవరికీ చికిత్స సూచించలేదని.. ఇది జస్ట్ తన వ్యక్తిగత అనుభవమేనని స్పష్టం చేశారు. ప్రతి క్యాన్సర్ పరిస్థితి, వైద్యం వేరుగా ఉంటుందని, అందరూ తమకు సురక్షితమైన మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. క్యాన్సర్‌తో తాను చేసిన పోరాటాన్ని నిజాయితీగా పంచుకున్నానని పేర్కొన్నారు.
Latest News