|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 03:20 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక ‘వారణాసి’ చిత్రంపై రోజుకో కొత్త అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎం.ఎం. కీరవాణి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని తెలిపారు. సంగీతం అందరూ ఊహించిన దానికంటే భిన్నంగా, గొప్ప స్థాయిలో ఉంటుందని, అభిమానులు దీన్ని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.ఇదిలా ఉండగా, ఈ సినిమాలో కీలకమైన హనుమంతుడి పాత్రను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మహేశ్ తండ్రి పాత్రలో మాధవన్ కనిపిస్తారని వార్తలు వచ్చినా, ఇప్పుడు హనుమంతుడి పాత్రలో నటించనున్నారనే ఊహాగానాలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Latest News