|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 02:11 PM
అక్కినేని కుటుంబంలో గత కొంతకాలంగా పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహం 2024 డిసెంబర్‌లో జరగ్గా; చిన్న కుమారుడు అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్జీని ఈ ఏడాది వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, తన ఇద్దరు కోడళ్ల రాకతో ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం గురించి నటి అమల అక్కినేని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాజాగా అమల మాట్లాడుతూ "అత్తగా మారడం చాలా అద్భుతమైన అనుభూతి. నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు" అన్నారు. నాగచైతన్య భార్య శోభిత గురించి చెబుతూ "శోభిత చాలా ప్రతిభావంతురాలు, స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఆమెతో సమయం గడపడం నాకెంతో ఇష్టం" అని ప్రశంసించారు.ఇక చిన్న కోడలు జైనబ్ గురించి మాట్లాడుతూ "జైనబ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆమె తన రంగంలో నిష్ణాతురాలు. జైనబ్ రాకతో మా హిందూ కుటుంబంలోకి ఇస్లాం సంప్రదాయం కూడా వచ్చింది. ఇది ఎంతో అందమైన విషయం" అని అమల వివరించారు.
Latest News