|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:41 PM
సంక్రాంతి పండుగ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. ఈసారి చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాలతో పాటు, అనిల్ సుంకర నిర్మిస్తున్న శర్వానంద్ హీరోగా నటించిన 'నారీ నారీ నడుమ మురారి' సినిమా కూడా విడుదల కానుంది. ఇప్పటికే నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లను ఆక్రమించే అవకాశం ఉండటంతో, శర్వానంద్ సినిమాకు థియేటర్లు దక్కడంపై చర్చ జరుగుతోంది. గతంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలు సంక్రాంతికి హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.
Latest News