|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:59 PM
కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తల్లిదండ్రులను, భగవంతుడిని ఆరాధించాలని నటుడు శివ కార్తికేయన్ తన అభిమానులకు సూచించారు. చెన్నైలో జరిగిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాని సరైన రీతిలో వినియోగించుకుని కెరీర్‌పై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మిరాజు కూడా పాల్గొన్నారు. ఇటీవల ‘మదరాసి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం ‘పరాశక్తి’ సినిమాలో నటిస్తున్నారు.
Latest News