|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:18 PM
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ల వివాహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె సోదరుడు శ్రవణ్ మంధాన స్పష్టం చేశారు. 7న వీరి వివాహం జరగనుందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతం పెళ్లి వాయిదాలోనే ఉందని, కొత్త తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.నవంబర్ 23న సంగ్రామ్‌లో స్మృతి, పలాశ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడి కారణంగా పలాశ్ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ కోలుకున్నప్పటికీ, ఆ షాక్ నుంచి ఇరు కుటుంబాలు ఇంకా పూర్తిగా తేరుకోలేదు.ఈ నేపథ్యంలో, పెళ్లి వాయిదా పడిన తర్వాత స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వివాహానికి సంబంధించిన పోస్టులన్నింటినీ తొలగించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. దీనికి తోడు డిసెంబర్ 7న పెళ్లి జరగనుందంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలపై హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన శ్రవణ్.. "ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది అంతే" అని స్పష్టతనిచ్చారు.
Latest News