|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 03:08 PM
మహిళలపై పెరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులకు వ్యతిరేకంగా నటి సమంత పోరాడటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేయనున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యత అని, ఆన్‌లైన్ వేధింపులను అంతం చేయడమే లక్ష్యంగా యూఎన్ విమెన్ ఇండియా నిర్వహించే కార్యక్రమంలో తన గళం వినిపించనున్నారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు జరిగే ఈ కార్యక్రమంలో తాను కూడా భాగమైనట్లు సమంత తెలిపారు. ఆన్‌లైన్ హింసను అరికట్టడానికి బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు అవసరమని సమంత అన్నారు.
Latest News