|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 06:08 PM
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించింది. ఆమె వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం విదితమే. వివాహ వేడుకలు జరుగుతుండగా స్మృతి మంధన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో వివాహ సంబరాలను నిలిపివేశారు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వివాహ సంబరాల ఫొటోలు కూడా మాయమయ్యాయి.పలాశ్ ముచ్చల్‌తో ఎంగేజ్‌మెంట్‌ను ధృవీకరిస్తూ ఇటీవల స్మృతి మంధన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. సహచర క్రికెటర్లతో కలిసి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన వేలికి నిశ్చితార్థపు ఉంగరం ఉందంటూ చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కనిపించడం లేదు. ఇదే వీడియోను స్మృతి స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక కూడా తమ సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి తొలగించారు.ఈ వీడియోను స్మృతి మంధన తొలగించిందా? లేక హైడ్ చేసిందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Latest News