|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 04:04 PM
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, 'దసరా' సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుతం నానితో 'ప్యారడైజ్' అనే పాన్-వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే, చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉంది. అయితే, చిరంజీవి శ్రీకాంత్ ఓదెలతో ఒక షరతు విధించినట్లు సమాచారం. 'ప్యారడైజ్' సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా, చిరంజీవితో చేసే సినిమాలో బూతులు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News