|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:38 PM
నటి మనిషా కొయిరాలా ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 1970 ఆగస్టు 16న జన్మించిన ఈమె, 1989లో నేపాలీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, 1991లో 'సౌదాగర్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. 55 ఏళ్ల వయసులోనూ ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, తాజాగా ఆమె తెల్లటి జుట్టుతో, ముఖంలో కాస్త డల్‌నెస్‌తో కనిపించడంతో చాలామంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. 2012లో అండాశయ క్యాన్సర్‌తో పోరాడి, 2015లో దానిని జయించిన మనిషా, ఆ తర్వాత సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా 2023లో ఒక హిందీ సినిమాలో కనిపించారు
Latest News