|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:17 PM
‘బలగం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు రూపొందిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాపై గత రెండేళ్లుగా కొనసాగుతున్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రానికి హీరో ఖరారయ్యారని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్టయింది.గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలు వెల్లడించారు. “ఎల్లమ్మ సినిమాకు హీరో ఫైనల్ అయ్యాడు. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం. అలాగే, ఈ నెలలోనే హీరోయిన్ వివరాలను కూడా ప్రకటిస్తాం” అని ఆయన తెలిపారు. తమ బ్యానర్‌లో 2026లో ఆరు సినిమాలు విడుదల కానున్నాయని, ప్రస్తుతం ‘రౌడీ జనార్దన్’ షూటింగ్ జరుగుతోందని ఆయన వివరించారు.
Latest News