|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:24 PM
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకోనున్నారని, నేడు కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో వీరి పెళ్లి జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న తరుణంలోనే, రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.శ్యామాలి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు (Desperate people do desperate things)’ అనే అర్థం వచ్చేలా ఒక కోట్‌ను పంచుకున్నారు. సమంత-రాజ్ పెళ్లి వార్తలు వస్తున్న సమయంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టడంతో, ఇది వారిని ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
Latest News