|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 02:19 PM
మంచు లక్ష్మి తన కుటుంబంలో చోటుచేసుకున్న వివాదాలపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. తన కుటుంబం మళ్లీ మునుపటిలా సంతోషంగా కలిసిపోవాలని ఆకాంక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు."ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, నా కుటుంబం అంతా మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటాను. ప్రతీ కుటుంబంలో గొడవలు సహజం. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి అందరూ ఒక్కటిగా ఉండాలి. మన భారతీయ కుటుంబాల్లో గొడవలు వస్తే మళ్లీ కలవకూడదనే మొండి పట్టుదలతో ఉంటారు. కానీ, కష్టకాలంలో మనకు అండగా నిలిచేది రక్తసంబంధీకులే. వారితో కలిసి ఉండటానికి ఎంతటి పోరాటమైనా చేయాలి కానీ, దూరం పెంచుకోకూడదు" అన్నారు.
Latest News