|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 02:06 PM
నటి అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. "ప్రేమమ్" సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసింది. ఈ ఏడాది ఆమె నటించిన తమిళ చిత్రాలు "డ్రాగన్", "బైసన్", మలయాళ చిత్రాలు "ది పెట్ డిటెక్టివ్", "జానకి", తెలుగు చిత్రాలు "కిష్కింధపురి", "పరదా" విడుదలయ్యాయి. ఆమె ఏడవ చిత్రం "లాక్‌డౌన్" డిసెంబర్ 5న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
Latest News