|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:38 PM
అర్షద్ వార్సీ ప్రధానమైన పాత్రను పోషించిన క్రైమ్ థ్రిల్లర్ 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్'. నేరుగా జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. జితేంద్ర కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, అక్షయ్ షేర్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 17వ తేదీన స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. జియో స్టూడియో - బవేజా స్టూడియో నిర్మించిన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం రండి.
కథ: పోలీస్ ఆఫీసర్ విశ్వాస్ భగవత్ కి 'లక్నో' నుంచి 'రాబర్ట్స్ గంజ్'కి బదిలీ అవుతుంది. భగవత్ తీరు పైఅధికారులకు నచ్చకపోవడంతో ఆయనకి ఈ బదిలీ జరుగుతుంది. భగవత్ తన భార్యాబిడ్డలతో కలిసి 'రాబర్ట్స్ గంజ్'కి మకాం మారుస్తాడు. అప్పటికి అక్కడి పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. పూనమ్ అనే అమ్మాయి అదృశ్యం కావడం .. ఆ గొడవలోకి రాజకీయ నాయకులు అడుగుపెట్టడమే అందుకు కారణమని అతను తెలుసుకుంటాడు.పూనమ్ విషయంలో విచారణ మొదలుపెట్టిన భగవత్ కీ, కౌసల్య .. సంధ్య .. మాలతి .. పూజ .. ఇలా 19 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారనే విషయం తెలుస్తుంది. టీనేజ్ అమ్మాయిలు .. పెళ్లికాని యువతులు మాత్రమే అదృశ్యం కావడం అతను గమనిస్తాడు. అయితే వాళ్లంతా ప్రేమించిన వ్యక్తితో పారిపోయారనే ప్రచారం ఆ ఊళ్లో జరుగుతూ ఉండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విచారణలో ఆయన మరింత ముందుకు వెళతాడు. కనిపించకుండా పోయిన అమ్మాయిలు వేశ్యా గృహాలకు తరలించబడుతున్నారా? అనే అనుమానంతో ఆ దిశగా తన ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తాడు. అయితే అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అతనికి లభించవు. ఆ సమయంలోనే అతనికి సమీర్ అనే ఒక వ్యక్తిపై సందేశం కలుగుతుంది. సమీర్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అదృశ్యమైపోయిన అమ్మాయిలంతా ఏమవుతున్నారు? అనేది మిగతా కథ.
Latest News