|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:41 PM
ప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సత్కరించనున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మానం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అధికారికంగా ప్రకటించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మురుగన్ ఈ వివరాలను వెల్లడించారు. "రజనీకాంత్, బాలకృష్ణ తమ సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయి. వారి అద్భుతమైన నటన, ప్రజాదరణతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు. వారి కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానిస్తాం" అని ఆయన తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఇఫి వేడుకలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్నాయి.
Latest News