|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 04:35 PM
తెలుగు సినీ పరిశ్రమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌పై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసుల కృషిని మనస్ఫూర్తిగా అభినందించారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఎంతో కష్టనష్టాలకోర్చి సినిమాలు తీస్తుంటే, రవి లాంటి వాళ్లు వేలాది సినీ కుటుంబాల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొన్ని వేల మంది కష్టాన్ని ఒక్కడు దోచుకోవడం సరికాదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి నేరాలు చేయడానికి భయపడతారు" అని అన్నారు. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ పైరసీపై యుద్ధంలో అండగా నిలిచారని చిరంజీవి ప్రశంసించారు.
Latest News