|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:03 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నందమూరి తారక రామారావు తమ్ముడు, నిర్మాత త్రివిక్రమరావు కుమారుడైన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి దాదాపు 35 ఏళ్ల తర్వాత 'ఛాంపియన్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. 1986లో 'అత్తగారు స్వాగతం'తో హీరోగా పరిచయమైన ఆయన.. 1989లో 'లంకేశ్వరుడు' తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు రోషన్ హీరోగా నటిస్తున్న 'ఛాంపియన్'లో రాజి రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.
Latest News