|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 03:28 PM
అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసిరాని హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఈ యువ నటి బీటెక్ పూర్తి చేసి, ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. 'షాదీ' షార్ట్ ఫిల్మ్‌కు ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది. ప్రియదర్శితో 'మల్లేశం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'మ్యాస్ట్రో', 'ఊర్వశివో రాక్షసివో', 'శాకుంతం', 'మళ్లీపెళ్లి', 'పొట్టేల్', 'తంత్ర' వంటి సినిమాల్లో నటించినా, 12 సినిమాల్లో కేవలం 2 హిట్స్ మాత్రమే సాధించి, స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.
Latest News