|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 03:27 PM
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవగణ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. గతంలో కరీనా కపూర్ పేరు వినిపించినా ఆమె ఖండించారు. తాజాగా ఓ పవర్ ఫుల్ రోల్ కోసం కాజోల్‌ను సంప్రదించగా.. ఆమెకు స్క్రిప్ట్ నచ్చి పాజిటివ్‌గా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే ‘స్పిరిట్’ కాజోల్‌కు తొలి తెలుగు చిత్రమవుతుంది.
Latest News