|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 09:54 PM
టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్‌గా నిలిచిన బాలకృష్ణ (Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) మరోసారి చేతులు కలిపి రూపొందిస్తున్న సీక్వెల్ ‘అఖండ 2 (Akhanda 2)’ కోసం అభిమానులు, పాన్–ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.ఇప్పటికే చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను శరవేగంగా ప్రారంభించింది.తాజాగా, మేకర్స్ విడుదల చేసిన బిగ్ అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. అఖండ 2 ట్రైలర్‌ను నవంబర్ 21 సాయంత్రం 6 గంటలకు చిక్‌బల్లాపూర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. బాలకృష్ణ – శివరాజ్‌కుమార్ కుటుంబాల మధ్య చాలా ఏళ్ల నుంచి ఉన్న అనుబంధం తెలిసిందే.దివంగత లెజెండరీ నటులు నందమూరి తారకరామారావు మరియు రాజ్‌కుమార్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, బాలకృష్ణ – శివరాజ్‌కుమార్ తమ తమ ఇండస్ట్రీల్లో అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించనుండటంతో అఖండ 2 ఈవెంట్‌పై హైపే హైపైంది.ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్ నెట్టింట వైరల్ అవుతూ మిలియన్ల వ్యూస్ సాధించిందని, ఇండస్ట్రీ టాక్‌ను షేక్ చేస్తోందని చెప్పాలి. తొలి భాగాన్ని మించిపోయే స్థాయిలో గూస్‌బంప్స్ హామీ ఇస్తున్న రషెస్ ఇప్పుడు అందరినీ మరింత ఎక్సైటింగ్‌లోకి నెట్టాయి.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Latest News