|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 10:43 AM
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన 'ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంలో శ్రావ్య హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశారు. పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ పాత్రలో ఆమె నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో శ్రావ్య ఖాతాలో మరో రెండు సినిమాలు చేరాయి. గతంలో 'అగ్రికోస్', 'కమిటీ కుర్రోళ్లు' చిత్రాల్లో నటించిన శ్రావ్య, 'కమిటీ కుర్రోళ్లు'లో మంచి నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న రెండు సినిమాలు కూడా హిట్ అయితే టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
Latest News