|
|
by Suryaa Desk | Tue, Nov 18, 2025, 12:00 AM
ఇండియన్ సినిమా పరిశ్రమలో ఈ మధ్య భారీ బడ్జెట్లతో రూపొందుతున్న మూడు మెగా ప్రాజెక్టులు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు కేవలం బడ్జెట్ పరంగా మాత్రమే కాకుండా, నటీనటులు, దర్శకులు, కథా ప్రతిపాదనలు కూడా టాప్ స్థాయిలో ఉన్నాయి.మొదటి మూవీ ‘రామాయణ’. దీని బడ్జెట్ ₹4,000 కోట్లు. భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా, నితేష్ తివారీ దర్శకత్వంలో, భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్నారు. ఇది మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతోంది.రెండో మూవీ ‘వారణాసి’. రాజమౌళి రూపొందిస్తున్న కొత్త మాస్టర్‌పీస్ ఇది. ఎప్పటికీ కొత్తదనం, భారీ స్కేల్‌కి ప్రసిద్ధి చెందిన రాజమౌళి, ఈ సినిమాకు ₹1,100 కోట్లు పెట్టబడ్డాయి. ఇది ఇండియాలో రెండో అత్యంత భారీ బడ్జెట్ మూవీగా వస్తుంది. మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇది అడ్వెంచర్ జానర్‌లో రూపొందుతోంది.మూడో మూవీ అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్. దీని బడ్జెట్ ₹800 కోట్లు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం భారీ హైప్ ఉంది. యాక్షన్, ఎమోషన్ కలిపిన పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
Latest News